BSNL : అతి తక్కువ ధరకే టారీఫ్ ప్లాన్స్
అతి తక్కువ ధరకే టారీఫ్ ప్లాన్స్ .
బి.ఎస్.ఎన్.ఎల్ లో కేవలం రూ. 108 లకే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ మొబైల్ కాల్స్, ప్రతిరోజూ 1జి.బి డేటా, 100 ఉచిత ఎస్.ఎమ్.ఎస్ వినియోగించుకోవచ్చు అన్ని ఎంజీఎం జి.సుభాష్ తెలిపారు .అదేవిధంగా రూ. 249 లకే 45 రోజుల పాటు అన్ లిమిటెడ్ మొబైల్ కాల్స్, ప్రతిరోజూ 2జిబి డేటా, 100 ఎస్.ఎమ్.ఎస్ ఉచితంగా పొందవచ్చు.మరెన్నో ఆఫర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార నిగం లిమిటెడ్ ( బి.ఎస్.ఎన్.ఎల్) ను ఆదరించాలని ఏజీఎం జి. సుభాష్ కోరారు. బుధవారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం లో ఉద్యోగులు, సిబ్బంది ప్లే కార్డ్స్ చేత పట్టుకొని బైక్ ర్యాలీని నిర్వహించి వినియోగదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ర్యాలీ కొత్తగూడెం డి.ఈ కార్యాలయం నుంచి సెంట్రల్ పార్క్ వరకు, తిరిగి విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డు వరకు కొనసాగింది. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏజీఎం మాట్లాడారు.ఈ సందర్భంగా..దేశంలో ప్రభుత్వ రంగ సoస్థల్లో ఒక వెలుగు వెలిగి..మొదటిస్థానంలో ఉన్న బి.ఎస్.ఎన్.ఎల్ తిరిగి పూర్వవైభవం సంతరించుకుంటుదని ఆశాభావం వ్యక్తం చేశారు.టెలికాం రంగంలోనే రారాజుగా కొనసాగి.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రైవేట్ రంగానికి ధీటుగా వినియోగదారులకు సేవలు అందిస్తూoదన్నారు.