ఖమ్మంతెలంగాణ

అన్ని దానాల కంటే అన్నదానం మిన్న

అన్ని దానాల కంటే అన్నదానం మిన్న

మధిర, శోధన న్యూస్ :  అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని ఆర్యవైశ్య సంఘం నాయకులు కపిలవాయి జగన్ తూములూరి ఉపేందర్ అన్నారు. శనివారం వర్తక సంఘం వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద దాతలు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చే విధంగా ప్రతి శనివారం వర్తక సంఘం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఆడంబరాలకు మితిమీరి ఖర్చులు చేయకుండా పేదల ఆకలి తీర్చే విధంగా అన్నదానాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో వెచ్చ శ్రీనివాసరావు, రామకృష్ణ, బొగ్గవరపు గణేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాతలు భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా బంజారా కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని గంగవరపు వీరారెడ్డి ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *