ఈవీఎంల వినియోగంలో అధికారుల అప్రమత్తంగా ఉండాలి -ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్
ఈవీఎంల వినియోగంలో అధికారుల అప్రమత్తంగా ఉండాలి
-ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్
వైరా, శోధన న్యూస్: నవంబర్ 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం లో అధికారుల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ అన్నారు . సోమవారం వైరాలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ ఈవీఎంల పనితీరుపై అధికారులు అప్రమత్తంగా ఉండి ఓటర్లకు తగు సూచనలు ఇవ్వాలని సూచించారు. పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం అయన పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ తో కలిసి ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఆయన వెంట వైరా ఏసిపి యం ఎ రహమాన్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.