ఎన్నికల అధికారులు విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి -జిల్లా కలెక్టర్ విపి గౌతమ్
ఎన్నికల అధికారులు విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
-జిల్లా కలెక్టర్ విపి గౌతమ్
వైరా, శోధన న్యూస్ : వైరా నియోజకవర్గంలో నేడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అధికారులు అప్రమత్తంగా ఉండి విధులు సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణుయస్ వారియర్ అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో అధికారులతో పని తీరుపై మరోసారి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అలసత్వం వహిస్తే ఎన్నికల నియామ నిబంధనల ప్రకారం కఠిన చర్యల తప్పు అని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించకుండా ఓటర్లు ప్రజలు సహకరించాలని ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని వారు సూచించారు. ఈవీ ఎం ఎలక్షన్ మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణుయస్ వారియర్, రిటర్నింగ్ అధికారి సత్య ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ విధులపై, అధికారులకు అవగాహన కల్పించారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లోని బససేయాలని కోరారు. బంధువుల ఇండ్లకి ఇతర ప్రాంతాలకు వెళ్ళవద్దని సూచించారు. ఎన్నికల శిక్షణ పొంది విధులకు గైర్హాజరయ్యారని ఆ అధికారులపై ఎన్నికల నియామ నిబంధనల ప్రకారం సాటిపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు ఎన్నికల విధులకు వెళ్లే పోలింగ్ మెటీరియల్ , ఈవీఎం వాహనాలను కలెక్టర్ పరిశీలించారు. వాహనాలకు భారీ బందోబస్తుతో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఏ సి పి యం ఏ రహమాన్, ఎన్నికల స్పెషల్ ఆఫీసర్లు , పోలీస్ సిబ్బంది, సిఆర్పిఎఫ్ బలగాలు పాల్గొన్నారు.