తల్లిని చంపిన కొడుకు
తల్లిని చంపిన కొడుకు
హైదరాబాద్ ,శోధన న్యూస్ : తల్లిని మించిన దైవం లేదంటారు. నవ మాసాలు మోసి కనిపించి కళ్లల్లో పెట్టుకొని చూసుకునే తల్లి మనసు కల్మషం లేనిది. అలాంటి అమ్మ ను ఎవరైనా చంపాలనుకుంటారా ఊహించడానికి మనసు దీని ఒప్పుకోదు.అలాంటిది ఓ కిరాతక కసాయి కొడుకు మద్యానికి బానిసై మద్యం తాగడానికి తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో విచక్షణ రహితంగా తల్లిని చంపిన సంఘటన శనివారం కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కల్వకుర్తి పట్టణానికి చెందిన కొప్నమోని బంగారమ్మ (45 ) కాలనీలోని ఇళ్లలో ఇంటి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఆమెకు ఒక కుమారుడు రమేష్ ఉన్నారు. రమేష్ చిన్నప్పుడే బంగారమ్మ భర్తను కూలిపోయింది. అప్పటినుంచి కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేసింది. తల్లి కష్టాన్ని చూసి తల్లికి సహాయం చేయవలసిన కొడుకే తల్లి పాలిట యముడయ్యాడు. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లి తలను బండకు మోది అతి దారుణంగా హత్య చేసే బంధువులకు సమాచారం ఇచ్చారు.మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.