తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు
మణుగూరు, శోధన న్యూస్: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయిస్తానని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరచడమే కాకుండా నేడు ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరణలో ఉద్యమకారులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల తెలంగాణ ఉద్యమకారులు వలసాల వెంకట రామారావు ,డాక్టర్ దుస్సా సమ్మయ్య అన్నారు .శుక్రవారం ప్రజా పాలన దరఖాస్తులను స్థానిక అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఇన్ని సంవత్సరాలుగా ఉద్యమ పార్టీగా చెప్పుకొనే బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్న ఉద్యమకారులను గుర్తించడంలో విఫలమైందని, నేడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను గుర్తించి అవకాశాలు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.