నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి -పినపాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్
నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
-పినపాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్
మణుగూరు, శోధన న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి భద్రాచలం ఐటిడిఏ పీఓ, పినపాక నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు మంగళవారం మణుగూరు పోలీస్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్(పోలీస్ కవాతు) నిర్వహించారు. మండలంలోని కిన్నెర కళ్యాణ |మండపం నుండి సురక్షా బస్టాండ్, పూలమార్కెట్ సెంటర్, సినిమాహాల్ సెంటర్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులలో ఓటు హక్కు ఎంతో విలువైందని, 18సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఓటింగ్‌కు వెళ్లేటప్పుడు ఓటర్ స్లిప్పులతో పాటు ప్రభుత్వంచే జారీ చేయబడిన గుర్తింపు కార్డులను వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఓటు విషయంలో ఏదైనా సందేహాలు ఉంటే సంబంధిత ఎన్నికల సిబ్బందికి గానీ, తమకు గానీ తెలియజేయాలన్నారు. అనంతరం మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు మాట్లాడుతూ… ఓటర్లు తమ ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్చగా, నిర్భయంగా వినియోగించుకోవాలని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలన్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, గుంపులు గుంపులుగా సంచరించరాదని సూచించారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని అతిక్రమించిన. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాఘవరెడ్డి, మణుగూరు సీఐ రమాకాంత్, ఎస్సైలు శ్రీనివాస్, రాజేష్ కుమార్. ఏఎస్ఐలు నాగేశ్వరరావు, మోహన్, శాంతి. సిఆర్‌పిఎస్ సిబ్బంది. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.