పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి -బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
ఓటు మన ఆయుధం
-పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
-బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
మణుగూరు, శోధన న్యూస్: ఖమ్మం,వరంగల్,నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల కు ఓటరుగా నమోదు చేసుకోవాలని,ఓటు మన ఆయుధమని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… నమోదు దరఖాస్తు స్వీకరణ నేటితో ఆఖరి రోజు కావడంతో పట్టభద్రులు త్వరగా ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో 2023 నవంబరు ఒకటో తేదీ నాటికి డిగ్రీ పూర్తయి మూడేళ్లు నిండిన పట్టభద్రులందరూ ధరఖాస్తు చేసుకోవాలన్నారు.