ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి -సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్
ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి
-సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్
తల్లాడ, శోధన న్యూస్ : ప్రభుత్వ వైద్యులు సకాలంలో విధులకు హాజరై ప్రజలకు సేవలు అందించాలని సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్ట రాగమయి దయానంద్ అన్నారు. తల్లాడ ప్రభుత్వాసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిని పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె సూచించారు. ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం అందించేలా డాక్టర్లు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలను ,సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రత్న మనోహర్, భాస్కర్, పెద్ద పుల్లయ్య, సోమ్లా నాయక్, కళావతి, కృష్ణారావు, కాంగ్రెస్ నాయకులు వేమిశెట్టి నాగన్న, పొట్టేటి సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.