ప్రజా పాలన సభలో ప్రోటోకాల్ పాటించలేదని మున్సిపల్ చైర్మన్ నిరసన
ప్రజా పాలన సభలో ప్రోటోకాల్ పాటించలేదని మున్సిపల్ చైర్మన్ నిరసన
సత్తుపల్లి, శోధన న్యూస్: ప్రజా పాలన సభలకు ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేష్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు నేలపై కూర్చుని నిరసన తెలిపారు. 17 వ వార్డులో గురువారం నిర్వహించిన గ్రామ సభకు మున్సిపల్ చైర్మన్ తో పాటుగా స్థానిక కౌన్సిలర్ కు ఏమాత్రం సమాచారం ఇవ్వలేదని, కనీసం ఫ్లెక్సీలో కూడా ప్రోటోకాల్ ప్రకారం ఫోటోలు, పేర్లు ముద్రించలేదంటూ ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. నిరసన సమాచారం తెలుసుకున్న సిఐ మోహన్ బాబు సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్లాలని తెలపడంతో చైర్మన్ మహేష్ రోడ్డుపై బైఠాయించి తన నిరసనను తెలిపారు. తర్వాత నాయకులు కలగజేసుకోవడంతో ప్రస్తుతానికి నిరసనను విరమించానని భవిష్యత్తులో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిన,సమాచార లోపం కనిపించిన సహించేది లేదన్నారు.