ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలి-జిల్లా కలెక్టర్ ప్రియాంక
ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం,శోధన న్యూస్: నెల రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఓటు హక్కు నమోదుపై జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తి ఓటు నమోదుకు అర్హుడేనని, రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఈ నెల 31లోపు నూతన ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. 31 తరువాత నమోదుకు అవకాశం ఉండదని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు.ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్లు మొదలైతే నూతన ఓటు దరఖాస్తుకు అవకాశం ఉండదని, వచ్చే నెల మొదటి వారంలో అభ్యర్థుల నామినేషన్లు మొదలవుతుండటంతో ఈ నెల 31నే నూతన ఓటర్లు తమ ఓటు నుమోదు చేసుకునేందుకు చివరి తేదీగా ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు తెలిపారు. విద్య, ఉద్యోగ రీత్యా పుట్టిన ఊరుకు దూరంగా ఉంటున్న వ్యక్తులు ఆన్లైన్ విధానంలో నూతన ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. కేంద్ర ఎన్నికల సంఘ వెబ్సైట్ www.nvsp.in.,voters.eci.gov.inతో పాటు రాష్ట్రానికి సంబంధించిన www..ceotelangana.nic.in వెబ్సైట్ ద్వారా నమోదుకు అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఉచిత డయల్ నంబర్ 1950కు ఫోన్ చేసినా సమాచారం ఇస్తామని, ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా, పేరులో దోషాలు ఉన్నా ఈ లోపే సరిచేసుకోవాలని తెలిపారు.ఎన్నికల సంగం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు చాలా ప్రాధాన్యత కలిగినదని, అర్హులైన ప్రతి ఒక్కరూ బాద్యతగా ఓటరుగా నమోదు కావాలన్నారు.నూతన ఓటర్లు ఓటు హక్కు పొందడానికి నమోదుకు ఈ నెల 31 చివరి తేదీ అని, తర్వాత అవకాశం ఉండదని, అర్హులు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.