ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ లకు ఖాకీ యూనిఫామ్ ఇవ్వాలి
మణుగూరు ఏరియా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ లకు ఖాకీ యూనిఫామ్ ఇవ్వాలి
మణుగూరు, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా సింగరేణి సెక్యూరిటీ విభాగానికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ లకు కూడా ఇతర ఏరియాలలో ఇచ్చినట్లుగా ఖాకీ యూనిఫామ్ ఇవ్వాలని కోరుతూ ఇఫ్టూ ఆధ్వర్యంలో ఏరియా ఎస్ ఓ టు జీఎం వీసం కృష్ణయ్యకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏరియా అధ్యక్షులు మంగీలాల్ మాట్లాడుతూ… సింగరేణి వ్యాప్తంగా ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్ లకు ఉచితంగా ఖాకీ యూనిఫామ్ ఏర్పాటు చేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. అలాగే మణుగూరులో కూడా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ లకు ఖాకీ యూనిఫామ్ ఇచ్చే విషయంలో సదరు నూతన కాంట్రాక్టర్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు ఇఫ్టూ దృష్టికి వచ్చిందని అన్నారు. ఏరియా సింగరేణి యాజమాన్యం చొరవ చూపి మణుగూరు ఏరియాలో కూడా ప్రైవేటు సెక్యూరిటీ గార్డు లకు ఎలాంటి షరతులు లేకుండా ఖాకీ యూనిఫామ్, ఇతర వస్తువులు ఉచితంగా ఇచ్చే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు కార్పొరేట్ అధికారులకు కూడా వినతి పత్రాలు అందజేయ నున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రామ్ అవతార్, డి సుధాకర్, ప్రభాకర్, భరత్, జి శ్రీను, వాసు, రబ్బాని, ప్రవీణ్, గఫార్, తదితరులు పాల్గొన్నారు.