బతుకమ్మ సంబరాల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
బతుకమ్మ సంబరాల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సత్తుపల్లి, శోధన న్యూస్: సత్తుపల్లి పట్టణంలోని బ్యాంక్ కాలనీ గల సాయిబాబా గుడి దగ్గర బతుకమ్మ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక ల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మహిళా ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అతి పెద్ద పండుగ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని అన్నారు.