తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో కొండంత భరోసా-బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి రేగా

బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో కొండంత భరోసా

-ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

-దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్

-ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మణుగూరు, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రజలకు కొండంత భరోసాగా నిలవనుందని ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు మండల, మున్సిపాలిటీ ఏరియాలలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. తొలుత స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. గ్రామ దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. దేశంలో ఇంటింటికి మంచినీళ్లు. ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతుబంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర మాత్రమే అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాల దిమ్మ తిరిగిపోయిందన్నారు. దేశం మెచ్చిన పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి నెంబర్ వన్. స్థానంలో తెలంగాణను నిలబెట్టినట్లు ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలతో ప్రజలను మభ్య పెట్టే మాయమాటలతో గ్రామాలకు వస్తున్నారని అన్నారు. బిఆర్ఎస్ తోనే ప్రజల సంక్షేమ అని అన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కొ సం బిఆర్ఎస్ పార్టీ ఎంతో గాను కృషి చేస్తున్నదని అన్నారు. సీఎం కేసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి అండగా ఉంటున్నారని న్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పేదల జీవితాలలో వెలుగులు నిండయని అన్నారు సీఎం కేసీఆర్ గారి సహకారంతో పినపాక నియోజకవర్గం రూపు రేఖలు మారిపోయాయని అన్నారు. అభివృద్ధి కోసం ప్రజలు బిఆర్ఎస్ కు ఓటు వె సి మరో మారు సీఎం కేసిఆర్ని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం తనను గెలిపించాలని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జెడ్పిటిసి పోశం నర్సింహరావు.. బీఆర్ఎస్ పెట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, పీఏసీఎస్ అధ్యక్షులు కుర్ర నాగేశ్వరరావు, నియోజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్, బీఆర్ఎస్ బూత్ ఇంచార్జ్ లు, బూత్ కో ఆర్డినేటర్లు. పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు: అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *