మంత్రి మాతృమూర్తి మృతికి ఎంపీలు నామ నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి నివాళి
మంత్రి మాతృమూర్తి మృతికి ఎంపీలు నామ నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి నివాళి
నిజామబాద్, శోధన న్యూస్ :
రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు , ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డిలు సంతాపం తెలిపి, తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామానికి ఆదివారం ఎంపీ శ్రీనివాసరెడ్డి తో కలసి వెళ్ళి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి చిత్ర పటానికి పూల మాల వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె మృతికి సంతాపం తెలిపి, ఘనంగా నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి ని, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నామ దైవాన్ని ప్రార్థించి, భరోసా కల్పించారు.