మణుగూరుకు డిప్యూటీ సిఎం రాక
మణుగూరుకు డిప్యూటీ సిఎం రాక
-బీటీపీఎస్ ను సందర్శన
-హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్డీఓ
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు మండలానికి శనివారం తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సిఎం మల్లు భట్టిమార్క రానున్నారు. మణుగూరు పర్యటన లో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను సందర్శించి పనులను పరిశీలించనున్నారు. డిప్యూటీ సిఎం రాక నేపధ్యం లో హెలిప్యాడ్ ప్రాంతాన్ని భద్రాచలం ఆర్డీఓ మంగీలాల్ , మణుగూరు డిఎస్పీ రాఘవేంద్ర రావు పరిశీలించారు. వీరి వెంట సిఐ రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.
-బిటీపీఎస్ ను సందర్శించిన ఆర్డీఓ:
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సిఎం మల్లు భట్టిమార్క పర్యటన నేపధ్యం లో బీటీపీఎస్ ను ఆర్డీఓ మంగీలాల్ శుక్రవారం రాత్రి సందర్శించారు. ప్లాంట్ స్థితిగతుల పై సీఈ బి బిచ్చన్న ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో తహశీల్దార్ రాఘవరెడ్డి, బీటీపీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.