మతసామరస్యాన్ని చాటుకున్న ముస్లిం దంపతులు.
మతసామరస్యాన్ని చాటుకున్న ముస్లిం దంపతులు.
– అయ్యప్ప స్వాములకు అన్నదానం
వైరా, శోధన న్యూస్: వైరా నియోజకవర్గంలోని శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదానం కార్యక్రమంలో భాగంగా వైరా పట్టణానికి చెందిన షేక్ జాన్ పాషా మైబు దంపతులు అయ్యప్ప స్వాములకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ముస్లిం దంపతులు మహా అన్నదాన కార్యక్రమంలో భాగంగా 116రూపాయలు వారు నిర్వాహకులు అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడంతో మత సామరస్యానికి ముస్లిందంపతులు నిదర్శనంగా నిలిచి సమాజానికి చాటి చెప్పారని భక్తులు కొనియాడారు.దేవాలయంలోని ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పీఠం వద్ద జాన్ పాషా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ ముస్లిం ఐక్యత కోసం భక్తులు మహా అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులు జాన్ పాషా దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి శ్రీ రామనేని శ్రీనివాసరావు బాసటి రామారావు ధర్నా ఉపేందర్ రేచర్ల వెంకటేశు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.