ఖమ్మంతెలంగాణ

ముమ్మరంగా కాంగ్రెస్ గడప గడపకు ప్రచారం

ముమ్మరంగా కాంగ్రెస్ గడప గడపకు ప్రచారం

  • ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పొంగులేటి  మాధురి

నేలకొండపల్లి, శోధన న్యూస్ :  మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ముమ్మరంగా గడప గడపకు ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ముజ్జు గూడెం గ్రామంలో గడప గడపకు ప్రచారంలో  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి పొంగులేటి మాధురి పాల్గొని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ పధకాలు,డిక్లరేషన్లను ప్రజలకు వివరించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిలబడుతున్నారని, ఆయనకు ఓటు వేసి గెలిపించాలనిఆమె ప్రజలను కోరారు.  కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల, బడుగు బలహీన వర్గాలు, రైతుల  కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను గ్యారెంటీ పధకాల్లో ప్రకటించిందన్నారు.  కాంగ్రెస్ అధినేత్రి  సోనియా గాంధీ  ఆరు పథకాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రకటించారన్నారు. వాటిలో మహిళల కోసం మహాలక్ష్మి పథకం ప్రతినెల 2500 రూపాయలు, గ్యాస్ రూ500 , ఆర్టిసి బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణం, ఇల్లు లేని ప్రతి మహిళకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి రూ.5లక్షలు , నెలకు పింఛను రూ 4వేల , ఆరోగ్యశ్రీ ద్వారా రూ10 లక్షలు , రైతుకు ఎకరానికి రూ 15 వేలు, ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.  ఈ కార్యక్రమంలో ముజ్జుగూడెం గ్రామ కాంగ్రెస్ నాయకులు వేగినాటి లక్ష్మీ నరసయ్య, ఉండమోదుల శ్రీను, ఉన్నం వెంకటేశ్వర్లు, బొమ్మూరు ప్రసాద్, దండా వెంకటేష్, ఉన్న శీనివాసరావు శ్రీనివాసరావు, ఎస్.కె.యకుబి, ఎస్కే సులేమాన్, రాగళ్ళ పుల్లయ్య, రాగల నాగేశ్వరరావు రాగల సురేష్, మండల కాంగ్రెస్ నాయకులు, నెల్లూరి భద్రయ్య, మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న, కుక్కల హనుమంతరావు, శాఖమూరి రమేష్, వెన్నపూసల సీతారాములు, గొళ్ళ శ్రీనివాసరావు, పెదపాక ముత్తయ్య, గండు సైదులు, మరికంటి రాజేష్, పల్లెబోయిన లక్ష్మీనారాయణ, చెరువు స్వర్ణ, బండి నాగలింగేశ్వరరావు, మక్కథల రామకృష్ణ, గుడిబోయిన వెంకటేశ్వర్లు, షేక్ కాజామియా, ఇంకా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *