మెచ్చా గెలుపు కోసం డోర్ టూ డోర్ ప్రచారం
మెచ్చా గెలుపు కోసం డోర్ టూ డోర్ ప్రచారం
అశ్వారావుపేట, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజక వర్గం అశ్వారావుపేట గ్రామంలో స్థానిక గెస్ట్ హౌస్ బజార్, పోస్ట్ ఆఫీస్ రోడ్ లో డోర్ టూ డోర్ తిరుగుతూ అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు, సీఎం కెసిఆర్ గెలుపు కోసం టౌన్ పార్టి ఆధ్వర్యంలో డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు బిఆర్ఎస్ మేనిఫెస్టో ను వివరిస్తూ కారు గుర్తుపై ఓటు వేయాలని ప్రతీ గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరినీ అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, జిల్లా అధికార పార్టీ ప్రతినిధి ప్రకాష్ రావు, అశ్వారావుపేట టౌన్ పార్టి ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, మండల నాయకులు,సిమకుర్తి వెంకటేశ్వర రావు, కుమార స్వామి, సెట్టీపల్లి రఘురాం,సోమని రమేష్, బ్రహ్మరావు,ధర్మ,వెంకన్న, తాళం సూరి,లింగిసెట్టీ వెంకటేశ్వరరావు, బాలి కిరణ్,లింగంకుంట కృష్ణ త్రినాథ్,వెంకటేష్, శివ, శ్రీను, కృష్ణా , కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.