తెలంగాణ

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే-టిపిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే 

-ఇందిర 25వేల పైచిలుకు తో గెలుపు ఖాయం

-బి ఆర్ ఎస్ ప్రభుత్వం కూలడం ఖాయం..

-టిపిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి
జనగామ, శోధన న్యూస్ :  జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింగపురం ఇందిరా అధ్యక్షతన భారీ విజయభేరి సభను నిర్వహించింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా టిపిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ రాజ్యమే. ఒక ఆడబిడ్డ ఇక్కడ పోటీ చేస్తుంటే రాజయ్య, శ్రీహరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాజయ్య, శ్రీహరి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. శ్రీహరి సంగతి రాజయ్య చెప్పిండు. రాజయ్య సంగతి శ్రీహరి చెప్పిండు. నిల్చున్న అభ్యర్థి కడియం శ్రీహరి ఆడబిడ్డ అయినటువంటి ఇందిరా పై మర్యాద నిలుపుకోవాలని, నిలుపుకోకపోతే కర్రు కాల్చి వాత పెడతామని హెచ్చరించారు. గతంలో ఉన్న రాజయ్యకు ఇప్పుడున్న కడియం శ్రీహరికి సారూప్యత ఉందన్నారు. అదేంటంటే ఇద్దరూ తెలంగాణ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పదవులను అనుభవించి వారి ధనాపేక్షకు సీఎం కేసీఆర్ పదవులను ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాడు. వాళ్ల అవినీతిని సీఎం కేసీఆర్ ఏ జీర్ణించుకోలేదు ఘన్పూర్ ప్రజలు ఎందుకు నమ్ముతారన్నారు . పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. బీఆరెస్ ఆరుగురు మహిళలకు టికెట్లు ఇస్తే.. కాంగ్రెస్ 12 మంది మహిళలకు టికెట్లు ఇచ్చిందన్నారు. సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్య చేసుకుంటుంటే..ఈ దద్దమ్మ దయాకర్ రావు వాళ్లను ఖాళీ సీసాలు అమ్ముకోమంటారా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంద న్నారు. నిరుద్యోగ యువతి ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుంటే.. ఈ ప్రభుత్వం ఆ కుటుంబం పరువును బజారుకీడ్చింది. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయ్యాక శిరచ్ఛేదనం జరిగిందన్నారు. పాల భైరవుడు కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయి..ఈ ఎన్నికల్లో శిరచ్ఛేదనం జరగాల్సిందే.. బీఆరెస్ ప్రభుత్వం నేల కూలాల్సిందే అన్నారు. కడియం శ్రీహరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న కూడా ఘన్పూర్ కు డిగ్రీ కాలేజ్ రాలేదన్నారు.  రాజయ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఘన్పూర్ కు ప్రభుత్వ ఆసుపత్రి రాలేదన్నారు.  హిందీలోని గెలిపిస్తే 100 పడకల ఆసుపత్రి డిగ్రీ కాలేజ్ ను ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంవత్సరంలోని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే సింగపురం ఇందిర అశేష మెజారిటీతో గెలుపు ఖాయం చేసుకున్నదని అనిపిస్తుందన్నారు.  ఇందిరను గెలిపించి అసెంబ్లీకి పంపడమే వి బాధ్యత తర్వాత పనులు చేయడం మా బాధ్యత అని హామీ ఇస్తున్నానన్నారు. సింగపురం ఇందిర మాట్లాడుతూ…గతంలో స్టేషన్గన్పూర్ అభివృద్ధి ఎక్కడుందో ఇప్పటికీ అక్కడే ఉంది 100 పడకల ఆసుపత్రికి ముగ్గు కూడా పోయలేని దుస్థితి గత ఎమ్మెల్యే రాజయ్యది అన్నారు.  ఇదివరకు కేటీఆర్ గారే కడియం శ్రీహరి ఎన్కౌంటర్ శ్రీహరిగా సంభోదించేవారు అలాంటి ఎన్కౌంటర్ శ్రీహరి చేతుల్లో ఎంతోమంది ఎన్కౌంటర్లు చనిపోయిన వారిలో వందకు పైగా దళిత బిడ్డలు ఉండడం కమణారహం ఇప్పుడున్న కడియం శ్రీహరి ఎన్కౌంటర్ శ్రీహరి కాకుండా కిడ్నాప్ శ్రీహరిగా మారి కాంగ్రెస్ పార్టీపై మమకారంతో నమ్మకంతో పార్టీలో చేరడానికి విచ్చేస్తున్నటువంటి ప్రజా ప్రతినిధులను సర్పంచులను వార్డు మెంబర్లను కిడ్నాప్ చేసి బెదిరించి చేరకుండా చేస్తున్నాడన్నారు.  ఈరోజు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్టేషన్గన్పూర్ జడ్పిటిసి మారపాక రవిని కూడా ఇంటి ముందు పోలీసు బందోబస్తు లాగా టిఆర్ఎస్ కార్యకర్తలు గుమ్మగుడి తనను బయటకు రాకుండా చేసి చేరికను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు అయినప్పటికీ రజాకార్లను తప్పించుకున్న మాదిరిగా టిఆర్ఎస్ కార్యకర్తలను తప్పించుకొని రేవంత్ రెడ్డి సమక్షంలో చేరడానికి విచ్చేశాడు అదేవిధంగా 8 మంది ఎంపీటీసీలు ఇస్తాను నాకు టికెట్ కన్ఫామ్ చేయగానే 8 మంది ఎంపీటీసీలు వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక కాంగ్రెస్ రాజ్యం రాబోతుంది రోటీ కప్పడా మఖాన్ నినాదంతో ఏర్పడ్డ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సభాముఖంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తానని తెలిపారు తెలంగాణ ఏర్పడ్డాక టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాల కాలంలో ఆదాయం పెంచుకోవడం కోసం మద్యం పాలసీలను తో మద్యం షాపులను ఎక్కువ గా పెంచి జనాలను తాగుబోతులుగా మార్చారు గత కొద్ది రోజుల క్రితం జనగామలో నాలుగో తరగతి 12 ఏళ్ల అబ్బాయి తాగుడుకు బానిసై చనిపోయిన విషయం పాలకులు మర్చిపోయారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కడియం శ్రీహరికి ఛాలెంజ్ విసిరారు ఎందుకంటే ఒకవేళ ఊడిపోతే ఎమ్మెల్సీగా మూడున్నర సంవత్సరాల పదవి కాలాన్ని అనుభవించొచ్చని ఉద్దేశంలో ఉన్న కడియం శ్రీహరికి ఘనపూర్ ప్రజల మీద చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేసిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *