విజయ బాయికి పితృవియోగం
విజయ బాయికి పితృవియోగం
వైరా, శోధన న్యూస్ : వైరా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకురాలు బానోతు విజయభాయి తండ్రి ఉమ్మడి ఖమ్మం జిల్లా సిపిఐ (ఎం) నాయకులు గుగులోత్ ధర్మ సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచా ర కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హుటాహుటి న మంగపేటకు చేరుకొని గుగులోతు ధర్మ వ]భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళ్ళర్పించారు. విజయభాయిని, వారి కుటుంబ సభ్యులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ధర్మ అకాల మరణం తీరని లోటన్నారు. పొంగులేటి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు బొర్రా రాజశేఖర్, సూతకాని జయపాల్, కాంగ్రెస్ పార్టీ టిపిసిసి సభ్యు లు మాలోత్ రాందాస్ నాయక్, శీలం వెంకట నర్సిరెడ్డి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉ న్నారు.