స్వేచ్ఛగా ప్రజలు ఓటు హక్కు వినియోగించండి
స్వేచ్ఛగా ప్రజలు ఓటు హక్కు వినియోగించండి
జూలూరుపాడు శోధన న్యూస్:ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించు కోవాలని కళాకారులు కళ జాతా నిర్వహించారు.బుధవారం మండల కేంద్రంలో ఓటు హక్కు విలువను తెలియచెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఆదేశాల మేరకు జిల్లా పౌరాసంబంధాల అధికారి శీలం శ్రీనివాస రావు పర్యవేక్షణలో కళాకారులు ప్రదర్శన చేశారు.తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత కళాకారులు పాటలతో ప్రజలు తమ ఓటును స్వేచ్ఛ గా హక్కును వినియోగించుకోవలని తెలిపారు.30వ తేదీ గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలవుతుందన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు ను ప్రజలు హక్కుగా భావించాలని తెలిపారు.ఓటు వేసేందుకు వెళ్లే ప్రజలు స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా,ఎవరికి భయపడకుండా స్వేచ్ఛగా ఓటు ను వినియోగించుకోవాలని సూచించారు.పోలింగ్ బూత్ లోని అధికారులకు సహకరించి ఎన్నికల నియమావళి లోని అంశాలను తప్పకుండా పాటించాలని,అసాంఘిక చర్యలకు తావివ్వకుండా వంద శాతం ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా సజావుగా నిర్వహించేందుకు దోహదపడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాకారులు కాంపల్లి బాలు, అలవాల నందు,మూసా,స్నేహ, నీలా, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.