తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి – మణుగూరు ఏరియా జీఎం దుర్గం రామచందర్

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి.

-మణుగూరు ఏరియా జీఎం దుర్గం రామచందర్

మణుగూరు, శోధన న్యూస్: బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు అధికారులు, ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా జీఎం, మల్టీ డిపార్ట్మెంట్ బృంద ఏరియా కన్వీనర్ దుర్గం రామచందర్ సూచించారు. మంగళవారం ఏరియాలోని పికెఓసి2ను మల్టీ డిపార్ట్మెంట్ బృందం సందర్శించి తనిఖీ చేశారు. అనంతరం గని ఉద్యోగులకు, అధికారులకు మన సంస, మన గని, మన బాధ్యత అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం రామచందర్ మాట్లాడుతూ… సమిష్టి కృషితో ఉత్పత్తి లక్ష్యాలను సునాయసంగా సాధించవచ్చన్నారు. నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ.. ఏరియాను, సంస్థను ఆదర్శవంతం చేయాలన్నారు. ఉత్పత్తి లక్ష్యాలను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ… రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్టీ డిపార్ట్మెంట్ బృంద కమిటి సభ్యులు ఎస్వోటు జీఎం వీసం కృష్ణయ్య, ఏజిఎం(ఈఅండ్ఏ ఎం)ఎం సర్సీరెడ్డి, ఇంచార్జ్ ప్రాజెక్ట్ అధికారి టి వీరభద్రరావు, డిజిఎం (పర్సనల్) ఎస్ రమేష్, డిజిఎం (ఐఈ) వెంకట్రావు, డిజిఎం(ఎల్అండ్) అనురాధ, ప్రాజెక్ట్ మేనేజర్ రాంబాబు, ప్రాజెక్ట్ ఇంజనీర్ పి వీరభద్రుడు, సీఎంఓఏఐ ఏరియా అధ్యక్షులు కృష్ణమూర్తి, ఎస్ఈ (ఐఈడి) శ్రీనివాస్, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి వై రాంగోపాల్, ఐఎన్టియుసి బ్రాంచ్ ఉపాధ్యక్షులు వి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *