అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వాముల మహా పడిపూజ
అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వాముల మహా పడిపూజ
ఆళ్లపల్లి, శోధన న్యూస్: మండల పరిధిలోని మర్కోడు గ్రామంలోని లక్ష్మీ ప్రసన్న జ్యువెలరీ షాప్ మోదుగుంపురం దయాకరాచారి ప్రసన్న దంపతుల ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి అయ్యప్ప స్వాముల మహా పడిపూజ కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహించడం జరిగిందని, టేకులపల్లి మండల మహా పడిపూజ గురుస్వామి నటరాజు గురుస్వామి తెలిపారు. అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమం అనంతరం వారు మాట్లాడుతూ..ఉమ్మడి గుండాల, ఆళ్లపళ్లి, మర్కోడు గ్రామాలకు చెందిన గురు స్వాములు, కన్యస్వాములు, మణికంఠ స్వాములు, కత్తి స్వాములు సైతం అధిక సంఖ్యలో పూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొనడం గర్వకారణమన్నారు. ఈ పడిపూజ కార్యక్రమంలో గురుస్వాములు మల్లికార్జున్ స్వామి, రాముస్వామి, శ్రీనుస్వామి, సుబ్బారావు స్వామి, వెంకటేశ్వర్ల స్వామి, తాళ్లపల్లి సాగర్, అఖిల్, వినయ్, నవజీవన్, రవి, పొదలబోయిన అశోక్, సుతారి అజయ్, చిరువేరి సతీష్, ఆరేళ్ల లక్ష్మీనారాయణ, వేణు, చామకూర నరేష్, కోరుకుప్పల సాగర్, ఈశ్వరోజు సద్గుర్ణచారి, కోనేటి వీరభద్రచారి, రాఘవేంద్రచారి, నాగేష్, సిద్దు, దయాకర్, రామ్, చరణ్ సాయి, శివ సాయి, విద్యాసాగర్, కొమరం సుధాకర్, కిరణ్, కీసరి చింటూ, సాయిరాం, బాలరాజు, నవీనాచారి, వినోద్, సురేష్, లింగయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు..
-మండల పరిధిలోని మర్కోడు గ్రామంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు లక్ష్మీ ప్రసన్న జ్యూయలరీ షాప్ యజమాని మొదుగుంపురం దయాకర్ చారి గంట స్వామి లక్ష్మీ ప్రసన్న, దంపతులు వారి ఇంటి వద్ద గురుస్వామి అనుగోజు నటరాజు,స్వామి మల్లికార్జున్. రాము స్వామి. శ్రీను స్వామి. సుబ్బారావుస్వామి మరియు మార్కోడు. స్వాముల ఆధ్వర్యంలో హరి హరసుతుడైన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవోపేతంగా అయ్యప్ప స్వామిములు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురు స్వాములు గుండాల అయ్యప్ప స్వాములు ఆళ్లపల్లి స్వాములు గ్రామస్తులు పాల్గొన్నారు.