అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి
అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి
కారేపల్లి , శోధన న్యూస్ : ప్రపంచానికి దిక్సూచిలా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పనిచేసి దేశ ప్రజల మన్ననలు పొందిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్నారని పలువురు వక్తలు అన్నారు. బుధవారం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా కారేపల్లి గ్రామంలోనీ అంబేద్కర్ సెంటర్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అన్ని వర్గాల సంక్షేమం కోసం రాజ్యాంగాన్ని పకడ్బందీగా రాసిన మహానేత అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం సింగరేణి మండల గౌరవ అధ్యక్షులు తలారి చంద్రప్రకాష్,అధ్యక్షులు ఆదర్ల రాములు,ఆదెర్ల ఉపేందర్,దబ్బుడం సమ్మయ్య,కాకాటి వినీత్, డి నాగరాజు,బానోతు కిషన్ తదితరులు పాల్గొన్నారు.