తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు- టిఎస్ఎండిసి పీఓ శ్రీనివాస్ రావు

అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు 

– అధిక లోడ్ కు  రూ.2వేలు, బిల్లు లేకుంటే రూ.50వేల జరిమానా

-టిఎస్ఎండిసి పీఓ శ్రీనివాస్ రావు

-ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృత తనిఖీలు

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : టీఎస్ ఎండిసీ విధించిన నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని టీఎస్ ఎండిసీ పీవో శ్రీనివాసరావు తెలిపారు. ఇసుక రవాణాపై టిఎన్ఎండిసి అధికారులు దృష్టిసారించారు. అధిక లోడ్తో వెళ్లినా, ఎటువంటి బిల్లులు లేకుండా వెళ్తున్న ఇసుక వాహనాలపై కొరడా ఝులిపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, మధిర, బోనకల్లతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, పాల్వంచలలో రెండు బృందాలుగా మొత్తం 12మంది.. టిఎస్ఎండిసి అధికారులు, సిబ్బంది విస్తృత తనిఖీలను చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీనివాసరావు తో మాట్లాడారు. అధిక లోడ్తో వెళ్తున్న ఇసుక లారీలలో అధికంగా ఉన్న టన్ను లోడ్కు రూ.2వేల చొప్పున రుసుం విధిస్తామన్నారు. అదే విధంగా జిరో బిల్తో ఇసుక రవాణా చేస్తే రూ.50వేలు జరిమానాతో పాటు కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీలలో టీఎస్ఎండిసి అధికారులు, మైనింగ్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *