అఖండ మెజారిటీతో సండ్రను గెలిపించండి -రాజ్యసభ సభ్యులు బండి పార్థసారదిరెడ్డి
అఖండ మెజారిటీతో సండ్రను గెలిపించండి
-రాజ్యసభ సభ్యులు బండి పార్థసారదిరెడ్డి
పెనుబల్లి, శోధన న్యూస్ : సత్తుపల్లి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అఖండ మెజారిటీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కుప్పెనకుంట్ల బయ్యన్నగూడెం పెనుబల్లి గ్రామాలలో ఆయన విస్తృతంగా పర్యటించి ఎమ్మెల్యే సండ్ర విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులుగా కాకుండా 15 సంవత్సరాలుగా ప్రజలలో ఒకడై విస్తృతమైన సేవలు అందించిన నిరంతర ప్రజా సేవకుడు సండ్ర అని కొనియాడారు. ఆయన ప్రజలతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రజాసంక్షేమ పథకాల ప్రవేశపెట్టి ప్రజలకు నిరంతరమైన సేవలందించడానికి ప్రణాళిక బద్ధంగా పనిచేశారని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ డిసెంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటు గుర్తును కారు గుర్తుపై వేసి సండ్ర వెంకట వీరయ్యను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కెసిఆర్ కడుపుచూసే నేత, కాంగ్రెస్ పార్టీ నాయకులు జేబులు చూసే నేతలని విమర్శించారు. ప్రజలంతా కారు గుర్తుపై ఓటు వేసి సండ్రవెంకట వీరయ్యను అఖండ మెజారిటీతో గెలిపించాలని రాబోవు ప్రభుత్వం లో మన ఎమ్మెల్యే ను ప్రత్యేక హోదాలో చూస్తామని తెలిపారు .ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చెక్కిలాల మోహన్ రావు, ఎంపిపి లక్కినేని అలేఖ్య వినీల్, కోటగిరి సుధాకర్ బాబు, పసుమర్తి వెంకటేశ్వరరావు, కనగాల వెంకట్ రావు, మందడపు అశోక్ కుమార్, వంగా గిరిజాపతిరావు, తావు నాయక్, కోమటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.