అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
దమ్మపేట , శోధన న్యూస్: అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అంకంపాలెం ఎంపీటీసీ సోడెం మహాలక్ష్మి గంగరాజు శుక్రవారం ఆర్థిక సహాయం అందజేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలోని ఒక నిరుపేద గిరిజన కుటుంబానికి సంబంధించి నివాసగృహం అగ్నికి ఆహుతై నిరాశ్రయులైన పెద కుటుంబాన్ని అంకంపాలెం ఎంపీటీసీ సోడెం మహాలక్ష్మి గంగరాజు వారికి ఆర్థిక సాయం చేసి నిత్యవసర సామగ్రిని అందజేశారు. వారితో సర్పంచ్ బాజిరెడ్డి ,స్థానికులు ఉన్నారు.