అధికారులు కీలక పాత్ర పోషించాలి.
అధికారులు కీలక పాత్ర పోషించాలి.
జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్
వనపర్తి ,శోధన న్యూస్:ఎన్నికల నిర్వహణ సజావుగా నిర్వహించేందుకు సెక్టరీయల్ అధికారులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రజావాణి హాల్లో సెక్టరియల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 19 తర్వాత వచ్చిన ఫారం లను ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్హులైన ప్రతి ఓటరు పేరును ఓటరు జాబితాలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు ఏ. ఈ.ఆర్. ఓ లాగిన్ లో పెండింగ్ లో ఉన్న ఫారం 6,7 పై వివరాలు తహిసిల్దర్లను అడిగారు. అక్టోబర్4 న ప్రచురించిన ఓటరు జాబితాలో దివ్యాంగులు, వయోవృద్ధుల ను గుర్తించి జాబితాలో మార్కింగ్ చేయడం పూర్తి అయ్యిందా అని అడిగి తెలుసుకున్నారు.