అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం
అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం
-టిడిపి నియోజకవర్గ నాయకులు వట్టం నారాయణదొర
మణుగూరు, శోధన న్యూస్: తెలుగు దేశం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని ఆ పార్టీ పినపాక నియోజకవర్గ నాయకులు వట్టం నారాయణదొర అన్నారు. పినపాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మణుగూరులో సీనియర్ నాయకులు వట్టం నారాయణదొర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులంతా ఒకే నిర్ణయంతో ఐక్యంగా ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఓట్లను చీలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పార్టీ మద్దతిచ్చే పార్టీ అభ్యర్థి విజయానికి చిత్తశుద్ధితో కృషిచేయాలన్నారు. ఈ సమావేశంలో టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు పోటు రంగారావు, టిడిపి రాష్ట్ర నాయకులు గల్లా నాగభూషయ్య, పార్లమెంటు నాయకులు వాసిరెడ్డి చలపతిరావు, సమితి సింగారం సర్పంచ్ బచ్చల భారతి, గుండాల మండల అధ్యక్షులు తోలెం సాంబయ్య, కరకగూడెం మండల అధ్యక్షులు సిరిశెట్టి కమలాకర్, పినపాక మండల అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు, బూర్గంపాడు మండల అధ్యక్షులు తాళ్లూరు జగదీశ్వర్ రావు, అశ్వాపురం మండల అధ్యక్షులు తుళ్లూరు ప్రకాష్ రావు, మణుగూరు మండల అధ్యక్షులు దొడ్డి కృష్ణ , సీనియర్ నాయకులు ఇల్లందుల నరసింహులు, యార్లగడ్డ రాజా, మల్లెడి లోకేష్, తెలుగు మహిళా నాయకురాలు ఎస్కే కరిమునిషా బేగం, చావా శ్రీదేవి, తెలుగు యువత నాయకులు మానుకొండ రఘురాం, చావా రామారావు, టిడిపి వాసు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.