అధైర్య పడొద్దు అండగా ఉంటాం -జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
అధైర్య పడొద్దు అండగా ఉంటాం
–జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
మధిర, శోధన న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరు అధైర్య పడొద్దని అందరికీ అండగా నిలబడతామని జడ్పీ చైర్మన్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం మధిర పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ రాజు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిస్తే పొంగిపోయేది లేదని, ఓడితే కృంగిపోయేది లేదని రాజకీయాల్లో గెలుపోటములు సహజమని ఆయన అన్నారు. ప్రతి ఓటమి ఒక కొత్త పాఠాన్ని నేర్పుతోందని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజల మధ్యనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అన్ని విధాల అండగా నిలబడతామని ఆయన తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందేలా నూతన ప్రభుత్వం పని చేయాలన్నారు. ఈ సమావేశంలో ఐదు మండలాల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.