అభివృద్ధిని చూసి ఆదరించండి
అభివృద్ధిని చూసి ఆదరించండి
సత్తుపల్లి , శోధన న్యూస్: సత్తుపల్లి నియోజకవర్గం లో తన తండ్రి సండ్ర వెంకట వీరయ్య గత 15 ఏళ్లుగా చేసిన అభివృద్ధిని చూసి ఆదరించాలని భారత రాష్ట్ర సమితి అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య తనయుడు సండ్ర భార్గవ తేజ్ ప్రజలను కోరారు. వేంసూరు మండలంలోని వేంసూర్ లో గురువారం సండ్ర భార్గవ తేజ్ విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా భార్గవ తేజ్ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పరితపించే వ్యక్తి తన తండ్రి అని అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఆయన కోరారు.