అభివృద్ధి జరగాలంటే కారు గుర్తును గెలిపించండి – బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ
అభివృద్ధి జరగాలంటే కారు గుర్తును గెలిపించండి
– బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ
కామేపల్లి, శోధన న్యూస్ : అభివృద్ధి జరగాలంటే కారు గుర్తును గెలిపించాలని ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి భానోతు హరిప్రియ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మండల పరిధిలోని కెప్టెన్ బంజర, ముచ్చర్ల ,అబ్బాస్ పురం, బండిపాడు, రాయి గూడెం, రుక్కితండ, పండితాపురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా హాజరై ఘన స్వాగతం పలికారు. సందర్భంగా ఆమె కూడలలో మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా గెలిస్తే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తాడని పేర్కొన్నారు. ఇల్లందు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రజలు అభివృద్ధి చూసి ఓటు వేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోతు సునీత, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల హనుమంతరావు, నాయకులు అంతోటి అచ్చయ్య, సామ మోహన్ రెడ్డి, కట్రాల రాంబాబు, మూడ్ కృష్ణ ప్రసాద్,కొమ్మినేని శ్రీనివాసరావు, చల్లా హరి,విఠల్, కేలోతు భాస్కర్ నాయక్, తీర్దాల చిదంబర రావు,గుది సూర్యనారాయణ,నాగల్ మీరా,తూము బాబు,కాకర్ల వెంటేశ్వర్లు,సర్పంచ్ లు గుంపెనపల్లి అనంతరాములు,భీమా నాయక్, మూడ్ దుర్గా జ్యోతి,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.