ఖమ్మంతెలంగాణ

అభివృద్ధి, సంక్షేమం సిఎం కెసిఆర్ తోనే సాధ్యం- ఎంపీ నామ నాగేశ్వరరావు

అభివృద్ధి, సంక్షేమం సిఎం కెసిఆర్ తోనే సాధ్యం

-కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దు 

– ఎంపీ నామ నాగేశ్వరరావు
వైరా, శోధన న్యూస్ :  అభివృద్ధి, సంక్షేమం సిఎం కెసిఆర్ తోనే సాధ్యం  అని, కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోస వద్దని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రజలను కోరారు. శనివారం నియోజకవర్గ కేంద్రమైన వైరాలో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. వైరా నియోజకవర్గంలో మదన్ లాల్ ను మంచి మెజార్టీతో గెలిపించాలని, వైరా మున్సిపాలిటీ పరిధిలో పార్టీ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి వైరా పట్టణం లోని బ్రాహ్మణ పల్లి ,బోడేపూడి కాలనీలు, 7, 8 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు।  .ఇంటింటికి వెళ్లి ఓటర్లతో ముఖాముఖి గా ప్రత్యేకంగా కలిసి మాట్లాడి , మదన్ లాల్ ను గెలిపించాలని కోరారు .ఈ సందర్భంగా కాలనీలో సైడ్ మురుగు కాల్వలను , ఇతర అభివృద్ధి కార్యక్రమాలను నామ పరిశీలించారు . ఈ సందర్భంగా స్థానిక ఓటర్లను ముఖాముఖి కలుసుకొని ప్రత్యేకించి మాట్లాడి మదన్ లాల్ ను మంచి మెజార్టీతో ఆశీర్వదించాలని ఆయన కోరారు. ప్రజలు కెసిఆర్ కు అండగా నిలవాలని ఈ సందర్భంగా జరిగిన రోడ్డు షోలో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వార్డు సభ్యులు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తనకు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారని,వారికి రుణపడి ఉంటానని తెలిపారు.  బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతో మేలు చేస్తున్న కేసీఆర్ కు అండగా ఉండి, గెలిపించా లన్నారు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని ,గెలిచేది మదన్ లాలేనని , మూడోసారి సీఎం అయ్యేది కేసీఆర్ అని స్పష్టం చేశారు. ప్రభుత్వo ఏర్పడగానే   మేనిఫెస్టోను అమలు చేసుకుందామని చెప్పారు .ఎన్నికలప్పుడు వచ్చి మోసపు మాటలు చెప్పేవారిని నమ్మొద్దని ,వారు పరిపాలించే రాష్ట్రాల్లో అమలు చేయడం చాతగాని పధకాలను ఇక్కడి కొచ్చి చేస్తామంటున్నారని, గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు . దేశంలోనే నెంబర్ వన్ అభివృద్ధి సాధించిన కేసీఆర్ కుఅండగా ఉండి, పార్టీ అభ్యర్థులను గెలిపించు కోవాలని నామ నాగేశ్వరరావు కోరారు. వైరాలో ఒకటవ వార్డులో సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 40 కుటుంబాలు బిఆర్ఎస్ లో చేరారు. ఏడు, 8 వార్డులలో 50 కుటుంబాలు టిఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో
బీఆర్ యస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు,మద్దెల రవి,మహిళ అధ్యక్షురాలు బాణోత్ సక్కుబాయి,,మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు,కౌన్సిలర్ లు వనమా విశ్వేశరావు, మాదినేని సునీత ప్రసాద్, దారేల్లి కొటయ్య,దారేల్లి పవిత్రకూమరి,చల్లాగోండ నాగేశ్వరరావు, తడికమల్ల నాగేశ్వరరావు, మార్కెట్ చైర్మన్ పసుపులేటి మోహనరావు,దిశ కమిటీ సభ్యులు కట్టా క్రిష్ణార్జునరావు, జెట్పీటీసీ నంబూరి కనక దుర్గ, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీ కోప్షన్ లాల్ మహమ్మద్, డాక్టర్ కాపా మురళీకృష్ణ , మాదినేని దుర్గ ప్రసాద్, మరికంటి శివ, ఏదునురి శ్రీనివాస్ రావు, భుమాత క్రిష్ణా మూర్తి, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *