తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

అభివృద్ధి సంక్షేమాన్ని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలి- ప్రభుత్వ విప్  రేగా కాంతారావు  

అభివృద్ధి సంక్షేమాన్ని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలి

-అభివృద్ధిలో దేశానికే దిక్సూచి తెలంగాణ రాష్ట్రం

-కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

– ప్రభుత్వ విప్  రేగా కాంతారావు  

మణుగూరు, శోధన న్యూస్ :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  మణుగూరు మండలం కేంద్రంలో  ప్రభుత్వ విప్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ  అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే , అసెంబ్లీ అభ్యర్ది  రేగా కాంతారావు  సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై కట్టు మల్లారం, గనిబోయిన గుంపు గ్రామాల నుంచి  కాంగ్రెస్ పార్టీ చెందిన సుమారు 50 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.  వారికి  ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపిన బిఆర్ఎస్ కు ప్రజలు మరోసారి పట్టం కట్టాలని ఆయన అన్నారు.  రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు కారు గుర్తుకు  ఓటు వేయాలని ఆయన కోరారు. పేదల పక్షపాతి బిఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన అన్నారు.  బిఆర్ఎస్ మ్యానిఫెస్టోపై గ్రామాలలో విస్తృతంగా చర్చ జరగాలని ఆయన అన్నారు. గ్రామాలలో జరిగిన అభివృద్ధి పనులు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాలలోని ప్రతి గడపకు వివరించడం కార్యకర్తల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పార్టీకి కార్యకర్తలే ప్రధానమని సైనికుల పనిచేసే బిఆర్ఎస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *