అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీ పథకాలు చేరాలి -అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీ పథకాలు చేరాలి
-అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అశ్వారావుపేట , శోధన న్యూస్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు అందజేస్తున్నామని అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంటీ పథకాలు తప్పనిసరిగా చేరవలసిన బాధ్యత అధికారుల పైనే ఉందని స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ప్రజా పాలన కార్యక్రమం మండలంలోని అచ్యుతాపురం గ్రామంలో గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజల నుండి ఆరు గ్యారెంటీ పథకాలలోని అన్ని అంశాలపై దరఖాస్తులను అధికారులు ఎమ్మెల్యే స్వీకరించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలోని పథకాలను కాంగ్రెస్ ఎన్నికల హామీలు భాగంగా ఇవ్వడం జరిగిందని హామీ ఇచ్చిన విధంగా అధికారంలోకి వచ్చిన మూడు రోజులలోనే రెండు హామీలను అమలు చేశామని అన్నారు. మిగిలిన హామీలను అతి త్వరలోనే తప్పనిసరిగా ఎన్ని వ్యయ ప్రయాసలకు లోనైనా అమలు చేస్తామని దానిలో భాగంగానే ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ప్రజా పాలన కార్యక్రమంపై ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ఇది నిరంతర ప్రక్రియ అని పలు దఫాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రజాసంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి దరిచేరే వరకు కూడా నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దరఖాస్తులు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరకు ప్రభుత్వ సిబ్బంది తీసుకుని వస్తారని దీంట్లో ప్రజలు అపోహలకు గురికా వద్దని దరఖాస్తులను నింపి మాత్రమే గ్రామసభలలో ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు .ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, మండలంలోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు ,కాంగ్రెస్ జిల్లా నాయకులు జూపల్లి రమేష్, జూపల్లి ప్రమోద్, నండ్రురమేష్, సత్యనారాయణ చౌదరి, అల్లాడి రామారావు, ఫణి, కర్నాటి శ్రీనివాసరావు, బత్తిన పార్థసారథి ,తాసిల్దార్ వి కృష్ణ ప్రసాద్, ఎస్సై శ్రీకాంత్, ఎంపీడీవో జి శ్రీనివాసరావు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.