అర్హులైన వారందరిని ఓటర్లుగా నమోదుచేయాలి -కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
అర్హులైన వారందరిని ఓటర్లుగా నమోదుచేయాలి
-కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, శోధన న్యూస్ : జిల్లాలో అర్హులైన వారందరిని ఓటర్లుగా నమోదు చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు . గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పార్లమెంట్ ఎన్నికలపై ఆమె రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికి ఓటు హక్కును కల్పించాలని, ఓటరు జాబితాలో ఓటర్ల సవరణ కచ్చితంగా చేయాలని అన్నారు. జనవరి 1, 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటుహక్కును కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో సవరణ 2024 నాటికి ముందు పోలింగ్ పునర్ వ్యవస్థీకరణ చేయాలని అన్నారు. చనిపోయిన వారి పేర్లను మరణ దృవీకరణనల అధారంతో జాబితా నుండి తొలగించాలని అన్నారు. బదిలి అయిన వాటిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. నూతన పొలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఫోటో ల మార్పు తదితర పనులను డిసెంబర్ 20 నుండి జనవరి 5 వ తేదీ 2024 వరకు నిర్వహిచడం జరుగుతుందని, జనవరి 6 నుండి 22 వరకు డ్రాఫ్ట్ రోల్ పై అభ్యంతరాలు, వాదనలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యఎన్నికల అధికారులు సూచించిన శని, ఆదివారాలలో స్పెషల్ క్యాంపేయిన్ లను నిర్వహించడం జరుగుతుందని, ఫిబ్రవరి 2 న అభ్యంతరాలను డిస్పోస్ చేయడం జరుగుతుందని, ఫిబ్రవరి 6న ఆరోగ్యవంతమైన తుది ప్రచురణ కోసం కమీషన్ అనుమతికి పంపించి వారి అనుమతి మేరకు ఫిబ్రవరి 8 న తుది జాబితాను విడుదల చేయడం జరుగుతుందని పేర్కోన్నారు.