అలుపెరగని అన్నదాత వీరయ్య చౌదరి
అలుపెరగని అన్నదాత వీరయ్య చౌదరి
అయ్యప్పల అన్నదానానికి 25 క్వింటాళ్ల బియ్యం వితరణ
మధిర , శోధన న్యూస్ : అలుపెరగని అన్నదాతగా ప్రముఖ పారిశ్రామికవేత్త మణిదీప్ షెట్టర్స్ అధినేత ధూళిపాటి వీరయ్య చౌదరి ఖ్యాతి గడిచారని ప్రముఖ వ్యాపారవేత్త కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా నాయకులు ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు కోన దామోదరావు అన్నారు. ఆర్వి సిండికేట్ ఆధ్వర్యంలో వర్తక సంఘం కళ్యాణ మండపంలో అయ్యప్ప మాలధారులకు ధూళిపాటి వీరయ్య చౌదరి ఆర్థిక సహకారంతో 33వ రోజు ఏర్పాటు చేసిన అన్నదానాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోన దామోదరావు ఆర్వి సిండికేట్ వ్యవస్థాపకులు రాచకొండ వెంకటేశ్వరరావు గురుస్వామి మాట్లాడుతూ వీరయ్య చౌదరి అయ్యప్ప మాలధారులకు అన్నదానం చేసేందుకు 40 రోజులకు సరిపడా బియ్యాన్ని వితరణగా అందజేశారని వారు తెలిపారు. గత మూడేళ్లుగా ఆర్ వి సిండికేట్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలదారులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. యనదానానికి మొదటి సంవత్సరం వీరయ్య చౌదరి 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని రెండో సంవత్సరం లక్ష రూపాయలు మూడో సంవత్సరం 25 అందించారని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి చల్లగా చూడాలని వారు ఆకాంక్షించారు.