అవయవ దానంపై అవగాహన కలిగి ఉండాలి
అవయవ దానంపై అవగాహన కలిగి ఉండాలి
కారేపల్లి, శోధన న్యూస్ : అన్ని దానాల్లోకెల్లా అవయవ దానం అత్యున్నతమైన దని,నేత్ర దానం తో అంధుల్లో వెలుగులు, దేహ దానంతో భావి వైద్యుల పరిశోధనలకు ఎంతో ఉపయోగ పడవచ్చునని,ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలనీ తెలంగాణ నేత్ర,శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పరికిపండ్ల అశోక్ పిలుపునిచ్చారు.మంగళ వారం కారేపల్లి మండల పరిధిలోని కొత్త కమలాపురంలో మచ్చ రామయ్య ఆధ్వర్యంలో జరిగిన అవయవ దాన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ చనిపోయిన తర్వాత అవయవాలను కాల్చడం ద్వారా బూడిద కావడం,మట్టిలో పాతడం ద్వారా మట్టిపాలు చేయకుండా అవయవ దానం చేసి చరిత్రలో చిరంజీవులుగా మిగిలి పోవాలన్నారు. భారతదేశంలో 12లక్షల మంది అంధులు ఇంతవరకు ప్రపంచాన్ని చూడలేక,నేత్ర దాతల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. అవయవదానం దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం పాల్గొన్న వారిచే అవయవ దానం చేస్తామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సలహాదారులు డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్,చాగంటి కిషన్,వడ్డే హనుమంత రాములు,కొచ్చర్ల వినీత్, ఆవుల వీరయ్య, పృథ్వీరాజ్,శేఖర్ లతోపాటు ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రాము తదితరులు పాల్గొన్నారు.