అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రి చరిత్రలో మొదటి సిజేరియన్ ఆపరేషన్ విజయవంతం
అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రి చరిత్రలో మొదటి సిజేరియన్ ఆపరేషన్ విజయవంతం
– డిసిహెచ్ ఎస్, వైద్య బృందాన్ని అభినందించిన జిల్లా కలెక్టర్
అశ్వారావుపేట, శోధన న్యూస్ : అశ్వారావుపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో తొలిసారిగా సీజరియన్ ఆపరేషన్ (పెద్ద ఆపరేషన్)గత నెల 31వ తేదీన విజయవంతం చేసి సుమారు మూడు కేజీ ల పండంటి మగబిడ్డకు ప్రాణం పోశారు. గతంలో పెద్దపరేషన్ కోసం కొత్తగూడెం, భద్రాచలం వంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేది. తద్వారా పేద ప్రజలకు ఎంతో వ్యయ ప్రయాసలోర్చి అక్కడ ఉండి ఆపరేషన్ చేసిన వారం రోజులకి ఇక్కడకి వచ్చేవారు. తదుపరి వైద్య పరీక్షలు చేపించుకోవాలన్న సూదర ప్రాంతం వెళ్లాల్సివచ్చేది. కానీ జిల్లా కలెక్టర్ ప్రియాంక అల ప్రత్యేక కృషితో ఒక ప్రసూతి వైద్యురాలిని సిహెచ్ సి అశ్వారావుపేట లో నియమించడం ద్వారా స్థానికంగానే సిజరీయన్ సెక్షన్ ఆపరేషన్, కుటుంబ నియంత్రణ ఆపరేషన్, గర్భిణీ స్త్రీలకు స్కానింగ్, ఇతర ప్రసూతి సేవలు అందుబాటులోకి వచ్చాయి. గత నెల 31న ఆసుపత్రి చరిత్రలోనే మొట్ట మొదటిది సిజేరియన్ అపరేషన్ ను కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో డిసిహెచ్ఎస్ పర్యవేక్షణలో అశ్వారావుపేట మండలం వేదాంతపురం నుండి వచ్చిన ఎస్ కే సుభాని అనే మహిళకి విజయవంతంగా పూర్తి చేయడం తో ఆమె మగ బిడ్డకి జన్మనిచ్చారు. . మారుమూల ప్రాంతమైన అశ్వారావుపేట లో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి, ప్రసూతి వైద్యులను నియమించి పూర్తిస్థాయిలో ప్రసూతి సేవలు అందుబాటులోకి తేవడం చాలా సంతోషంగా ఉందని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డిసి హెచ్ ఎస్ డాక్టర్ రవి బాబు తెలిపారు. ప్రసూతి వైద్యురాలు డాక్టర్ రాధ రుక్మిణీ, మత్తు వైద్యులు డాక్టర్ రామ్ ప్రసాద్, పిల్లల వైద్యులు డాక్టర్ ము క్కంటేశ్వరరావు, ఇతర వైద్య బృందాన్ని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.