అశ్వారావుపేట లో కాంగ్రెస్ అభ్యర్ది జారే ఘన విజయం
అశ్వారావుపేట లో కాంగ్రెస్ ఘన విజయం
-29,353 ఓట్ల ఆదిక్యంతో జారే ఆదినారాయణ గెలుపు
అశ్వారావుపేట, శోధన న్యూస్ : ఉత్కంఠంగా సాగిన అసెంబ్లీ ఎన్నికలలో అశ్వరావుపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ, సిపిఐ, టీజేఎస్ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జారే ఆదినారాయణ అఖండ విజయం సాధించారు. ఆయన తన సమీప అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ కు చెందిన మెచ్చ నాగేశ్వరరావు పై 29,353 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు. నియోజకవర్గంలోని అశ్వరావుపేట మండలంలో జారేకు 8190 ఓట్ల మెజారిటీ రాగా, దమ్మపేట మండలంలో 11300 ఓట్ల మెజారిటీ, అన్నపురెడ్డిపల్లి మండలంలో 1530 ఓట్ల మెజారిటీ, ములకలపల్లి మండలంలో 4405 ఓట్లు మెజారిటీ, చండ్రుగొండ మండలంలో 3480 ఓట్ల మెజారిటీ వచ్చింది. నియోజకవర్గ వ్యాప్తంగా అత్యధికంగా దమ్మపేటలో రాగా అత్యల్పంగా అన్నపురెడ్డిపల్లి లో రావడం గమనార్హం. అశ్వారావుపేట నియోజకవర్గం మొత్తం ఓట్లు 155961 కు గాను 135501 ఓట్లు పోలయ్యాయి. జారే ఆదినారాయణ (కాంగ్రెస్) 74420, మెచ్చ నాగేశ్వరరావు 45963, పిట్టల అర్జున్ (సిపిఎం)2483, ఎం ఉమాదేవి (జనసేన)2274, కల్లూరి కిషోర్ (స్వతంత్ర అభ్యర్థి)1906, పద్దం వెంకట రమణ (స్వతంత్ర)1752, మడకం ప్రసాద్ (బి ఎస్ పి)1578, నోటా 1362 , తంబళ్ల రవి 922, ఊకే రవి 855, మరో ఐదుగురు అభ్యర్థులకు నామమాత్రపు ఓట్లు వచ్చాయి.