ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం
ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం
మధిర, శోధన న్యూస్: అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని ఆలయ అన్నదాన కమిటీ నిర్వాహకులు వెలగపూడి హనుమంతరావు డాలు కృష్ణ అన్నారు. మంగళవారం ఆత్కూరు ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద దాతల ఆర్ధిక సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చే విధంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద గడ్డం రమేష్ జ్యోతి దంపతుల ఆర్థిక సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఆడంబరాలకు మితిమీరి ఖర్చులు చేయకుండా పేదల ఆకలి తీర్చే విధంగా అన్నదానాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దాతలు భక్తులు పాల్గొన్నారు.