తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఆరు నూరైనా ఆరు గ్యారంటీల హామీని నెరవేర్చుతాం-పినపాక  ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

ఆరు నూరైనా ఆరు గ్యారంటీల హామీని నెరవేర్చుతాం
-పినపాక  ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

పినపాక, శోధన న్యూస్ : ఆరు నూరైనా ఆరు గ్యారంటీల హామీని నెరవేర్చుతామని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని పినపాక గ్రామంలోని రైతు వేదికలో తహసీల్దార్ వీరభద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఆడపడుచులకు మంజూరైన 38 కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై చెక్కులు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలలో భాగమైన మహిళల ఉచిత బస్ ప్రయాణం, ఐదు లక్షలున్న ఆరోగ్య శ్రీ కార్డును 10 లక్షలు వరకు పెంచారని అలాగే త్వరలో కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ కు ఇప్పుడు ఇస్తున్న నగదుతో పాటు తులం బంగారం కూడా ఇవ్వడం జరుగుతుందని అలాగే 100 రోజుల్లో 500 కి గ్యాస్ సిలిండర్,5లక్షల ఇందిరమ్మ ఇల్లు, ప్రతి మహిళకు ప్రతినెల 2500, చేయూత కింద 4000 పెన్షన్, చదువుకునే విద్యార్థులకు విద్య భరోసా కార్డు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక దందాలు, అక్రమ దందాలు, భూకబ్జాలు చేసిన ఎవరిని పార్టీలోకి చేర్చుకునే అవకాశం లేదన్నారు. అలాగే ప్రస్తుతం నాయకులు , కార్యకర్తలు కానీ ఏ పథకం కొసమైన డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకొని రావాలని అలాంటి వారిని ప్రజాభవన్ క్యాంపు కార్యాలయం గుమ్మం గేటు కూడా తాకనివ్వనన్నారు. అలాగే తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తని కాపాడుకుంటానన్నారు అనంతరం సీతంపేట, పినపాక లో పలు కుటుంబాలను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం, యూత్ నాయకులు ఆనంద్,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

-మణుగూరు లో : 

మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో  నీరు పేద కుటుంబాలకు చెందిన36 మంది ఆడపడుచులకు మంజూరైన కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను  పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం పంపిణిచేశారు. ఈ కార్యక్రమం లో తహశీల్దార్ రాఘవరెడ్డి, సర్పంచులు బచ్చల భారతి, తాటి సావిత్రి,ఉపసర్పంచులు తరుణ్ రెడ్డి, కనకయ్య, కాంగ్రెస్ నాయకులు , అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

-క్రీడాకారుడికి సన్మానం :

జూనియర్  నేషనల్ ఫుట్ బాల్ ఎస్ జీఎఫ్ క్రీడకు మణుగూరు నుండి ఎంపికైన  మణుగూరు మండలంలోని కూనవరం గ్రామానికి చెందిన పాటి నాగరాజు కుమారుడు పాటి సిద్ధివిగ్నేశ్వర్ ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శాలువతో సన్మానించి  ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయంగా అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *