ఆరోగ్యవంతమైన ఓటర్ జాబితా తయారు చేయాలి -ఓటరు జాబితా పరిశీలకురాలు బాల మాయాదేవి
ఆరోగ్యవంతమైన ఓటర్ జాబితా తయారు చేయాలి
-ఓటరు జాబితా పరిశీలకురాలు బాల మాయాదేవి
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్:
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని ఆరోగ్యవంతమైన ఓటర్ జాబితా తయారు చేయాలని ఓటరు జాబితా పరిశీలకురాలు సీనియర్ ఐఏఎస్ అధికారి బాల మాయాదేవి తెలిపారు. మంగళవారం ఐడిఓసి సమావేశపు హాలులో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం, తుది ఓటరు జాబితా ప్రకటన తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో బాగంగా వచ్చిన ఫారం క్లెయిమ్స్ ను పరిశీలించారు.
తొలగింపుల జాబితా, చేర్పుల జాబితా సిద్ధం చేయాలన్నారు. యువత ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. 8న లోక్ సభ ఎన్నికల ఓటరు తుది జాబితా విడుదల చేయనున్నందున ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు,మరణించిన ఓటరు ను తొలగింపుకు వచ్చిన దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఓటరు ఓటు హక్కు కలిగి ఉండాలని చెప్పారు. తుది జాబితా విడుదల చేయుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా రూపకల్పనపై నియోజకవర్గ వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి బుధవారం సమావేశం నిర్వహించాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో ఐటిడిఏ పిఓ ప్రతిక్ జైన్, అదనపు కలెక్టర్ పి రాంబాబు, కొత్తగూడెం ఆర్డీవో శిరీష, ప్రత్యేక ఉప కలెక్టర్ కాశయ్య, ఎన్నికల విభాగం తహశీల్దార్ దారా ప్రసాద్, నియోజకవర్గ కేంద్ర తహసీల్దార్ లు.తదితరులు పాల్గొన్నారు.