ఆళ్లపల్లి లో 108 వాహనాన్ని తనిఖీ చేసిన ఆడిట్ అధికారి
108 వాహనాన్ని తనిఖీ చేసిన ఆడిట్ అధికారి
ఆళ్లపల్లి , శోధన న్యూస్ : మండలానికి చెందిన 108 వాహనాన్ని మంగళవారం క్షుణ్ణంగా పరిశీలించి, తనిఖీ చేయడం జరిగిందని, జిల్లా అంబులెన్స్ వాహన ఆడిట్ అధికారి ఫకీర్ దాస్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 108 వాహనాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, వాహనంలోని ఔషధాలను, పరికరాలను, వాటి పనితీరును, రికార్డుల నిర్వహణలకు సంబంధించిన పలు విషయాలను 108 సిబ్బంది ఈఏంటి, పైలెట్లకు సలహాలు, సూచనలు చేశారు. అంబులెన్స్ వాహనంలో గడువు ముగిసిన మాత్రలను, ఔషధలను ఉంచరాదని తెలిపారు. వారు అదే క్రమంలో 108 వాహనాన్ని కేసులను అడ్మిట్ చేసిన అనంతరం యధావిధిగా లిక్విడ్ ద్రావణంతో శుభ్రం చేయాలని, విధి నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం, అలసత్వం ఉండరాదని, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు, సూచనల మేరకు రికార్డుల నిర్వహణ సరిగా ఉండేలా చూసుకోవాలని వారు సూచించారు. ఆ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 108 అంబులెన్స్ వాహనాలు 22 ఉన్నాయని, రాష్ట్రం మొదలుకొని, జిల్లాల, మండలాల వారీగా ప్రతి 3 నెలలకోకసారి తనిఖీలను చేయడం జరుగుతుందని వారు తెలిపారు. సిబ్బంది వాహనాన్ని రోగులకు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వారు సూచించారు. ఈ తనఖీ కార్యక్రమంలో ఈఎంటి ప్రేమలత, పైలెట్లు పరమ శ్రీహర్ష, పరమ సునీల్ కుమార్ పాల్గొన్నారు.