ఆశీర్వదించి గెలిపించండి మరింత అభివృద్ధి చేస్తా – ఎమ్మెల్యే సండ్ర
ఆశీర్వదించి గెలిపించండి మరింత అభివృద్ధి చేస్తా
— ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
తల్లాడ, శోధన న్యూస్ : సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బిఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తల్లాడ మండలం మల్లవరం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ నియోజకవర్గాన్ని అన్ని వర్గాలకు సంక్షేమం కోసం పాటుపడ్డానని, అన్నీ విదాల అభివృద్ధి చేశానని, మరోసారి ఆదరించి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అభిమానులు పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రమైన తల్లాడ లో అంబేద్కర్ భవనానికి 50 లక్షలు మంజూరు చేయించి దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడారని మాజీ ఎంపీపీ రాము ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ను ఘనంగా సన్మానించారు. ఎన్నికల్లో అత్యంత మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.