ఆశీర్వదించి గెలిపించండి-బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు నా యక్
ఆశీర్వదించి గెలిపించండి
-బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ రాంబాబు నా యక్
ఏన్కూరు, శోధన న్యూస్ : బహుజన్ సమాజ్ పార్టీ వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ రాంబాబు నా యక్ ఏనుకూరు మండలంలో తిరుగుతూ ఏనుగు గుర్తుపై ఓటు వేసి తనను అత్య ధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ప్రచా ర కార్యక్రమంలో భాగంగా.మండల పరిధిలోని బద్రు తండా లో పలు కుటుంబాలు ఏనుకూరు మండల అధ్యక్షులు యంగల నరేష్ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీలో కి చేరారు.వారికి బానోత్ రాంబాబు నాయక్ పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా బానోత్ రాంబాబు నాయక్ మాట్లాడు తూ..మండలం చూసుకుంటే ఎందరో యువకులు అత్యంత ఉన్నతమైన చదువు లు చదివి ఉద్యోగాలు రాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వక ఇంటికే పరిమితమై దీనాతి దీనమైన పరిస్థితులు యువకులు ఎదుర్కొంటున్నారనిఆయన అన్నారు.మండల ప్రజలకు నాణ్యమైన వైద్యం కరువైందని పనిచేసే వారికి ఉపాధి కరువైందని వారు అన్నారు.ఈ సమస్యలన్నీ పరిష్కార కావాలి అంటే బహుజన్ సమాజ్ పార్టీ ఈవీఎం సీరియల్ నెంబరు నాలుగు లో ఉన్న ఏనుగు గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన మండల ప్రజలను కోరారు. వైరా నియోజకవర్గ ప్రజలు ఎందరినో ఎమ్మెల్యేలుగా చేసి అభివృద్ధి చేయమని అడి గితే వారు అధికార పార్టీలోకి పోయి అత్యధికంగా వారే సంపాదించుకున్నారని,ప్రజ లకు అభివృద్ధి చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు.అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉచిత విద్య, ఉచిత వైద్యం మరియు రాష్ట్ర ప్రజలకు ఉపా ధి అవకాశాలు కల్పిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోబహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్ సెక్రెటరీ తంబర్ల నరసింహారావు,నియోజ కవర్గ కార్యదర్శి కంచ పోగు నరసింహారావు,మంద మోసెస్,లలిత,భానోత్ రజిని. భోగ ఉత్తేజ్,అనిత, మాడుగుల శరత్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.