ఇంకుడు గుంతల నిర్మాణంలో అక్రమాలను వెలికి తీయాలి
ఇంకుడు గుంతల నిర్మాణంలో అక్రమాలను వెలికి తీయాలి
ములకలపల్లి , శోధన న్యూస్ : మండలంలోని రాజాపురం గ్రామంలో ఇంకుడు గుంతలు నిర్మాణంలో జరిగిన క్రమాలను వెలికి తీయాలని సర్పంచ్ గడ్డం భవాని డిమాండ్ చేశారు. మంగళవారం గ్రామపంచాయతీలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజపురం గ్రామములో సుమారు 45 ఇంకుడు గుంతలు తీసుకున్న గుతేదరుడు వాటిని పూర్తి చేయకుండా సుమారు 90,000 రూపాయలు దూర్వినియోగం చేశాడని తెలిపారు. ఆ గుతేదరునికి నిర్మాణ పనులు అప్పగించ వద్దని మొదటి నుంచి సర్పంచగా నేను చెప్తున్నా రాజకీయ అందదండలతో వారు పనులు చేస్తాను అని తీసుకొని ప్రజల నుంచి కూడా కొంత డబ్బును వసూలు చేసి వాటి పూర్తి చేయలేదని తెలిపారు. దీని పై మండల పరిషత్ అభివృద్ధి అధికారికి సెప్టెంబర్ 20న పిర్యాదు చేయగా వారు ఇంత వరకు ఎలాంటి చేర్యలు తీసుకోలేదు. దీని పై ఉన్నత అధికారులకు కూడా పిర్యాదు చేయడం జరుగుతుందని సర్పంచ్ గడ్డం. భవాని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు.