తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు  ఏర్పాట్లు పూర్తి -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక 

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు  ఏర్పాట్లు పూర్తి

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక 

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులతో పాటు ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఫిబ్రవరి 1వ తేది నుండి 15వ తేదీ వరకు జరుగనున్న ప్రాక్టికల్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వాహణకు జిల్లాలో 61 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  పరీక్షలు నిర్వహణ తీరు పర్యవేక్షణకు ముగ్గురు సభ్యులతో జిల్లా పరీక్షల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటిలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచనా రాణి కన్వీనర్ గాను, మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్డీ యూసఫ్, అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకులుగా పనిచేయుచున్న సుధాకర్ రెడ్డి సభ్యులుగా ఉన్నట్లు ఆమె తెలిపారు. మొదటి సంవత్సరంలో 2433 మంది ఓకేషనల్ విద్యార్థులు, ద్వితీయ ఇంటర్ విద్యార్థులు 5893 మంది, అలాగే రెండవ సంవత్సరం ఓకేషనల్ విద్యార్థులు 1935 మంది హాజరవుతున్నట్లు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం అన్ని గ్రూపుల విద్యార్థులకు 16వ తేదీన ఆంగ్లంలో ప్రాక్టికల్ పరీక్ష ఉంటుందని ఆమె తెలిపారు. విద్యార్థులు చదివే కళాశాలల్లోనే ఆంగ్ల ప్రాక్టికల్ పరీక్ష ఉంటుందని, విద్యార్థులతో ఆంగ్లంలో మాట్లాడించడం, చదివించడం లాంటివి ఉంటాయని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పర్యావరణ విద్య పరీక్షను ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు చదివే కళాశాలల్లోనే ఇవి ఉంతాయని, 2023-24 విద్యా సంవత్సరానికంటే ముందు ఇంటర్ లో చేరిన పాత విద్యార్థులకు నైతికత, మానవీయ విలువల పరీక్ష ఫిబ్రవరి 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుపుతారని తెలిపారు. విద్యార్థులు చదువుతున్న కళాశాలల్లోనే నిర్వహిస్తామన్నారు. పరిక్షలంటే ఒత్తిడి, భయం వంటి ఫోబియా ఉన్న ఉంటే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన 14416 లేదా 1800914416 అనే టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి మానసిక నిపుణుల సలహాలు, సూచనలు తీసుకునే సౌలభ్యం ప్రభుత్వం కల్పించినట్లు ఆమె తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచే స్తుందని, రోజంతా సైకియాట్రిస్ట్లు అందుబాటులో ఉంటారని, విద్యార్థులకు అమూల్యమైన సలహాలు, సూచనలు ఇస్తారని చెప్పారు. పరీక్షలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయపు సిబ్బంది బిక్షం 9704661714, శివ కుమార్ 9346913069 నంబర్లుకు కాల్ చేయొచ్చు నని చెప్పారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలు చేరుకోవాలని ఆమె సూచించారు. రవాణాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాక్టికల్ పరీక్షలకు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాలలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేపించాలని పంచాయతీ, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో అత్యవసర వైద్య చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *