తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఇంటి నుండే  ఓటుహక్కు  వినియోగానికి అవకాశం-జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక 

ఇంటి నుండే  ఓటుహక్కు  వినియోగానికి అవకాశం

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక 

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ఈ నెల 21 నుండి 25 తేదీల వరకు  దివ్యాంగులు , 80 సంవత్సరాలు పైబడిన
వయోవృద్దులకు ఇంటి నుండి ఓటుహక్కు వినియోగానికి అవకాశం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. జిల్లాలో 241 మందిదివ్యాంగులకు, 484 మంది వయోవృద్దులు నమోదైనట్లు తెలిపారు. పినపాకలో 54 మంది దివ్యాంగులు , వయోవృద్దులు 54 మందికి, ఇల్లందులో 35 మంది దివ్యాంగులకు, వయోవృద్దులు 108లకు, కొత్తగూడెంలో 52 మంది దివ్యాంగులకు, వయోవృద్దులు 110 మందికి, అశ్వారావుపేటలో 48 మంది దివ్యాంగులku, వయోవృద్దులు 126 మందికి, భద్రాచలంలో 52 మంది దివ్యాంగులకు, వయోవృద్దులు 86 మంది ఇంటి నుండి ఓటుహక్కు వినియోగించుకొనున్నట్లు ఆమె తెలిపారు. వీరందరికీ ఈ నెల 21 నుండి 25వ తేదీల్లో ఇంటింటికీ వెళ్లి ఓటుహక్కు వినియోగానికి చర్యలు తీసుకోనున్నట్లు  తెలిపారు. ఇట్టి సమాచారాన్ని అన్ని రాజకీయ పార్టీలకు అందించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇంటి నుండి ఓటు హక్కు వినియోగానికి ఎన్నికల సంఘం  నియమ, నిబంధనలు మేరకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *